
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామన్నారు. అయితే జగన్ మాత్రం 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు తెలుపుతున్నారన్నారు. పింఛన్ల విషయంలో జగన్ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నాము గదా అని తాము ఏం మాట్లాడినా చెల్లతుందనుకోవడం తప్పడు నిర్ణయన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తమ నేతలను అసెంబ్లీ హాలులోకి రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.