జగన్ అక్రమాస్తుల కేసు విచారణ బుధవారం సీబీఐ కోర్టులో జరగనుంది. మంగళవారం ఈ కేసు విచారణ చేపట్టాల్సి ఉండగా సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌రావు సెలవులో ఉండడంతో ఇన్‌చార్జి న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. వీటితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 5 కేసులూ, ఓఎంసీపై సీబీఐ కేసులపై విచారించనున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులపై రోజువారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని కోరుతూ మంగళవారం పలువురు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహన్‌ను కలిశారు. దీంతో వయసు కలిగిన వారు తప్ప మిగతావారు కోర్టుకు తప్పనిసరిగా రావాలని సూచించింది.. అయినా వినతిని పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.