
దేశంలోనే ప్రజలపై అధిక పన్ను భారం మోపుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రజలపై సుమారు రూ.30 వేల కోట్ల పన్ను భారాన్ని వైకాపా ప్రభుత్వం మోపుతోందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రకటనలు ఇచ్చుకునే వైకాపా ప్రభుత్వం.. ప్రజలపై మోపుతున్న పన్ను భారాలపై ఎందుకు ప్రకటనలు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. లౌకిక పార్టీగా అధికారంలోకి వచ్చిన వైకాపా ఆలయాల్లో దేవుడి విగ్రహాలపై దాడులు జరుగుతుంటే బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు.