
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాలుగోరోజు రసాభాసగా సాగాయి. గురువారం సంక్షేమ పథకాలపై చర్చ నిర్వహించారు. ఈ పథకాలపై టీడీపీ సభ్యలు ప్రశ్నించగా మంత్రులు సమాధానం ఇచ్చారు. అయితే ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన నాయకులు ‘అమూల్’ ప్రాజెక్టుపై మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం పైకి ఎక్కి మరీ ఆందోళన చేయడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్టున్నట్లు ప్రకటించారు. కాగా టీడీపీ సభ్యులు గత నాలుగు రోజులుగా సస్పెన్షన్కు గురవుతున్నారు.