
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు (90) కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నాలుగు రోజుల క్రితం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీవిష్ణు ప్రసాదరావు కాట్రేనికోన గ్రామపంచాయతీకి 18 సంవత్సరాలపాటు సర్పంచ్‌గా సేవలందించారు. ఈయన 1972లో మొదటిసారిగా అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.