Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్విశాఖస్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖస్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోని స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్‌ ప్లాంట్‌లోని టీపీసీ-2లో గురువారం టర్బైన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో 1.2 మెగావాట్ల విద్యుత మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular