
కూతురు పుట్టిన రోజే వ్యక్తి మరణించడం అమెరికాలో విషాదం నెలకొంది. అనంతపురం జిల్లాకు చెందిన మసూద్ అలా న్యూజెర్సీలోని ప్లేయిన్స్ బోరోలో భార్య అయేషా, కుమార్తె అర్షియాతో జీవిస్తున్నాడు. గురువారం కుమార్తె అర్షియా పుట్టినరోజు కావడంతో రాత్రికి ఏర్పాట్లు చేశారు. తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళుతుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే గుర్తించిన స్థాణికులు మసూద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా అలా మరణంతో భార్య అయేషా ఒంటరైంది. ఆమెకు అమెరికాలో స్నేహితులు, బంధువుల కూడా లేదరు పొరుగువారితో పరిచయం కూడా లేదు. మసూద్ కుటుంబం సహాయం కోసం నాట్స్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది.