
పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వ అసమర్ధతతోనే నత్తనడకన సాగుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. వైసీపీ 18 నెలల కాలంలో పోలవరం పనులు 0.89 శాతమే చేశారని.. ఒక శాతం పనులు కూడా చేయని జగన్ 2022 జూన్ నాటికి పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో జగన్ లాలూచీ పడ్డారని మండిపడ్డారు. వాళ్లు ఒక మీటర్ తగ్గించమంటే వీళ్లు నాలుగు మీటర్లు తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 30 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేస్తే.. వైసీపీ ప్రభుత్వం 18నెలల్లో 3 లక్షల క్యూబిక్ మీటర్లు వేశారని అన్నారు.