
ఈరోజు రాత్రి 7 గంటలకు అందరూ చప్పట్లు కొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. తన నివాసం నుంచి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.