
ఆ వైద్యుడు మొదటిసారి కరోనా వచ్చినప్పడు సరైన జాగ్రత్తలు తీసుకొని కోలుకున్నాడు. కానీ రెండో సారి రావడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో ఆయన మృతి చెందాడు. కడపజిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నందకుమార్ కు ఆరునెలల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం కోలుకొని ఇంటికి వెళ్లారు. ఆ తరువాత యధావిధిగా ప్రభుత్వ ఆసుపత్రిలో తన విధులకు హాజరయ్యాడు. ఇటీవల మళ్లీ ఆయనకు జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మరోసారి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం చైన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. దీంతో నందకుమార్ ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.