
చంద్రబాబు రాజధాని కట్టకపోవడం వల్లే అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. పోర్టుల నిర్మాణంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజధాని కోసం 365 రోజులుగా రైతులు, మహిళలు, వృద్ధులు రోడ్డెక్కి పోరాడుతున్నారని చెప్పారు. అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 105 మంది రైతులు దిగులుతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న రైతులను భయబ్రాంతులకు గురిచేయొద్దన్నారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’ నినాదంతో రైతులు ముందుకు సాగుతున్నారని తెలిపారు.