
చిత్తూరుజిల్లా రేణిగుంట రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పశువులను కాస్తూ పట్టాలపైకి వచ్చిన శశికుమారి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.