
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరిపంచారు. అంతకుముందు అలిపిరి దారి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించారు. జవహర్ రెడ్డి టీటీడీకి 27వ అధికారి. జవహర్‌రెడ్డి ప్రస్తుతం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తాత్కలిక ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది. అక్కడి ఉన్న జవహర్‌రెడ్డి టీటీడీకి బదిలీ అయ్యారు