
ఏపీలో గడచిన 24 గంటల్లో 60,329 కరోనా టెస్టులు నిర్వహించగా 667 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో 9 మంది మరణించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 129 కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,71,972 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,59,029 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,910కి దిగొచ్చింది. మొత్తం మరణాల సంఖ్య 7,033కి చేరింది.