ST reserved constituencies: ఏపీలో( Andhra Pradesh) ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో సీన్ మారుతోంది. ఆది నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. అటు తర్వాత ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. 2014, 2019 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా సత్తా చాటింది. మొత్తం ఏడు ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాలకు గాను.. నాలుగు చోట్ల టిడిపి, రెండు చోట్ల జనసేన, మరో రెండు చోట్ల వైసిపి గెలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 11 స్థానాలు అయితే అందులో రెండు స్థానాలు ఎస్ టి వి కావడం విశేషం. పైగా అరకు ఎస్టి పార్లమెంటు స్థానాన్ని సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికీ వైసీపీకి ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు తగ్గలేదు.
ఆ ఏడు నియోజకవర్గాలపై..
అయితే కూటమి గెలిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎస్టీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పై ఫోకస్ చేశారు. తరచూ ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. దీంతో అక్కడ గిరిజనుల్లో మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి.. పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నవి. గడిచిన ఎన్నికల్లో పాలకొండ నుంచి జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ గెలిచారు. పార్వతీపురం, కురుపం, సాలూరు, రంపచోడవరం ల నుంచి టిడిపి అభ్యర్థులు గెలిచారు. అరకు తో పాటు పాడేరులో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అరకు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ తనుజారాణి గెలిచారు.
గట్టిగానే పవన్ ప్రయత్నం..
అయితే ఈసారి ఎస్టి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటేలా పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేశారు. గెలిచింది మొదలు ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. కొండ శిఖర గిరిజన గ్రామాలకు సైతం రవాణా సౌకర్యాలను మెరుగుపరిచారు. గిరిజన గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దీంతో గిరిజనుల మనసు కూడా మారుతోంది. వారు సైతం కూటమి పార్టీల పట్ల తమ అభిమానాన్ని పెంచుకుంటున్నారు. ఆ మూడు పార్టీల వైపు టర్న్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వారు సంఘటితం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే.
