YSR Congress Party: ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. కూటమి దూకుడు చూస్తుంటే అది సాధ్యమయ్యే పని కాదు అని తెలుస్తోంది. ఈ తరుణంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో ప్రాంతీయ విద్వేషాలను రగిలించేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదని కూటమి ఆరోపిస్తోంది. ఏ రాయలసీమ ను అడ్డం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. అదే ప్రాంతాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఆ పార్టీ. ప్రధానంగా సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక రంగాల్లో చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే రాయలసీమ ప్రయోజనాల పేరిట కొత్త నాటకం ప్రారంభించింది ఆ పార్టీ. అమరావతి పై విషం చిమ్ముతూ.. డబ్బునంత అక్కడే ఖర్చు పెడుతున్నారంటూ సీమ ప్రజలలో వ్యతిరేక భావన వచ్చేలా ప్రయత్నిస్తోంది.
* ఎప్పటికప్పుడు స్టాండ్స్ మార్చుతూ..
గతంలో మూడు రాజధానులు అన్నది వైయస్సార్ కాంగ్రెస్. అప్పట్లో న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు ఒక హైకోర్టు ప్రతిపాదన చేసింది. ఇప్పుడేమో మావిగన్ అంటూ అమరావతి పక్కనే నగరాలను కలుపుతూ రాజధాని చేయాలని చూస్తోంది. మరోవైపు రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ కొత్త నినాదాలు అందుకుంది. ఐదేళ్ల లో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కానీ.. ఉపాధి కల్పనలో కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. హంద్రీ నీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసింది. ఇప్పుడు రాయలసీమ ప్రయోజనాల పేరుతో అక్కడి ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావన ప్రభుత్వం పై వచ్చేలా పన్నాగం పన్నుతోంది.
* ఇప్పటికీ అదే విషం..
అమరావతి పై విషం చిమ్మడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపడం లేదు. దానిని రాయలసీమలో మూడు పెడుతూ ప్రచారం చేస్తోంది. కానీ అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆర్థిక వనరు కూడా. అక్కడ సృష్టించే ప్రతి రూపాయి, సంపద రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి దోహదం చేయనుంది. సమాజంతో పాటు పరిస్థితులపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఎంతలా నష్టపోయాయి తెలియంది కాదు. ఇప్పుడు ప్రత్యేక ప్రాంతం నినాదాన్ని ప్రజలు లెక్క చేసే స్థితిలో లేరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కావు.