Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్

YSR Congress: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఊపిరి పీల్చుకుంది. డీలిమిటేషన్ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకుంది. దీంతో ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన ఉండదని తేలిపోయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్విభజన భయం వెంటాడింది. ఎందుకంటే ఆ ప్రక్రియ ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అందునా టిడిపి కేంద్రంలో కీలక భాగస్వామి. ఈ సమయంలో పునర్విభజన జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం ఖాయం. అనివార్య పరిస్థితుల్లో ఈ పునర్విభజన బిల్లుకు మద్దతు తెలిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ బిల్లు పాస్ కాకపోవడంతో చాలా ఆనందపడుతోంది. పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి విపక్షాల తీరును ఖండిస్తున్నారు. లోలోపల మాత్రం చాలా ఆనందపడుతున్నారు. దానికి కారణం పునర్విభజన ఉండదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలు యధాతధంగా ఉంటాయి.

* 2009లో కాంగ్రెస్ కు లబ్ధి
2009లో పునర్విభజన జరిగిన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అది ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. విపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇబ్బంది తెచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖుల నియోజకవర్గం. బలమైన నియోజకవర్గాలను ముక్కలు చేస్తూ వేరువేరు నియోజకవర్గాల్లో కలిపారు. రిజర్వేషన్లను తారుమారు చేశారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ఉండేది. అందుకే రాజశేఖర్ రెడ్డి తనకు నచ్చిన విధంగా డీ లిమిటేషన్ చేసుకున్నారు అనేది ప్రతిపక్షాలు చేసే ఆరోపణ. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే మాదిరిగా వ్యవహరిస్తారని జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన కూడా అదే. ఇప్పుడు డీ లిమిటేషన్ బిల్లు పాస్ కాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది.

* తప్పనిసరి పరిస్థితుల్లోనే..
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అవకాశాలు తగ్గిపోతాయని.. మిగతా నాలుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వెళ్లాయి. కానీ ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన, బిజెపి సానుకూలంగా స్పందించాయి. అయితే అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. అయితే ఈ బిల్లుతో డి లిమిటేషన్ జరిగితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగక మానదు. అయితే కేసులతోపాటు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. కానీ బిల్లు పాస్ కాకపోవడంతో లోలోపల తెగ ఆనందపడుతోంది.. ఇక తమకు నష్టం ఏమీ ఉండదని భావిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version