YS Sharmila: షర్మిల తో జగన్ రాజకీయ ప్రయత్నిస్తున్నారా?సంధి చేసుకోవాలని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారా? ఈ విషయాన్ని కుటుంబంలో కీలక వ్యక్తికి అప్పగించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకుంటే వైసీపీకి తీరని నష్టం కలుగుతుందని జగన్ ఒక అంచనాకు వచ్చారు. అందుకే ఆమె కాంగ్రెస్ రూట్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం తో పాటు ఆస్తి వివాదాలను సైతం పరిష్కరిస్తానని రాజీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
తాను జగన్ కోసం ఎన్నో విధాలా పాటుపడ్డానని..కానీ తనకు చాలా అన్యాయం జరిగిందని పలు సందర్భాల్లో షర్మిల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో సోదరుడుతో షర్మిలకు విభేదాలు ఉన్నాయి. అందుకే అమ్మ బాహటంగా బయటికి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు.అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తన ఫెయిల్యూర్ కు జగనే కారణమని షర్మిలలో ఆగ్రహం ఉంది. అందుకే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఆమె కానీ ఏపీలో అడుగు పెడితే వైసిపి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా.. అవి వికటించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే షర్మిలవైఫల్యాలను ప్రశ్నించి మరింత ఇరకాటంలో పెడతారు. అంతిమంగా నష్టం చేకూరేది కుటుంబానికే. అందుకే కుటుంబంలో కీలక వ్యక్తికి షర్మిలను నియంత్రించే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
కడప పార్లమెంట్ స్థానంతో పాటు ఆస్తి వివాదానికి సంబంధించి పరిష్కార మార్గం చూపిస్తానని జగన్ చెబుతున్నట్టు సమాచారం. అయితే తొలుత మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆ వ్యక్తి షర్మిల వద్దకు వెళ్లి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. కడప ఎంపీ స్థానఁ నుంచి బరిలో దింపాలన్న ప్రతిపాదన పెట్టనున్నారు. ఆస్తిక్ సంబంధించి కూడా షర్మిలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పంపకాల విషయమై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. షర్మిల తో భేటీ, ఆమెను తిరిగి వైసీపీలో క్రియాశీలకం చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు వైసిపి ముఖ్య నేతల వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనికి షర్మిలా ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఈ చర్చలు ఫెయిల్ అయితే మాత్రం ఏపీలో వేర్వేరు రాజకీయ దారుల్లో సోదరి, సోదరుడు వెళ్ళే అవకాశం ఉంది.