YS Sharmila son: వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబానికి క్రిస్మస్ ప్రత్యేకం. దశాబ్దాలుగా ఆ కుటుంబం క్రిస్టియానిటీని అనుసరిస్తూ వస్తోంది. అయితే ఎంత దూరంలో ఉన్న క్రిస్మస్ పర్వదినాల నాడు పులివెందుల రావడం ఆనవాయితీగా ఉంది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కుటుంబమంతా ఒకచోట కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ వస్తోంది. 2019 ఎన్నికల వరకు అంతా కలిసి ఉంది ఆ కుటుంబం. కానీ తదనంతర పరిణామాలతోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆపై సోదరుడితో షర్మిల విభేదించడం వంటి కారణాలతో ఆ కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదించడంతో ఆ రెండు కుటుంబాలు కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. థాంక్యూ షర్మిలమ్మ అంటూ జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు.
క్రిస్మస్ వేడుకల్లో
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పులివెందుల( pulivendula) పర్యటనలో ఉన్నారు. అక్కడే క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుటుంబమంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి, భార్య భారతి, తల్లి విజయమ్మ తో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా ఒకే చోట క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ సోదరి షర్మిల మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రెండు రోజుల కిందట సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సమయంలో వారి మధ్య గొడవలు సద్దుమణిగాయని అంత భావించారు. కానీ ఇంతలోనే ఆ కుటుంబం అంతా ఒకచోట చేరింది. షర్మిల కనిపించలేదు కానీ.. ఆమె కుమారుడు మాత్రం భారతీ రెడ్డి పక్కనే కూర్చుంటూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి.
ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నం..
జగన్మోహన్ రెడ్డితో షర్మిల ను( Y S Sharmila ) కలిపేందుకు కుటుంబ పెద్దలతో పాటు శ్రేయోభిలాషులు రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో షర్మిల కుమారుడు కుటుంబంతో ఫోటోలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల కిందట షర్మిల కుమారుడు వివాహ వేడుకలు జరిగాయి. అయితే ఆ వేడుకలకు జగన్ హాజరు కాలేదు. అంతకుముందు నిశ్చితార్థ వేడుకలకు మాత్రం జగన్ దంపతులు హాజరయ్యారు. మేనల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగేందుకు షర్మిల అయీష్టత చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే ఈ మధ్యన ఇద్దరికీ పొలిటికల్ డ్యామేజ్ జరగడంతో సంధి కుదిర్చినట్లు ప్రచారం నడిచింది. ఇటువంటి సమయంలోనే జగన్ ఫ్యామిలీతో షర్మిల కుమారుడు కనిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. మున్ముందు ఆ కుటుంబ పరిణామాలు మారే అవకాశం ఉంది.