Jagan: పులివెందులకు జగన్.. ఆ లీడర్లు సరే..జనం మాటేంటి?

ప్రస్తుతం జగన్ పులివెందులలో ఉన్నారు.జగన్ చుట్టూ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు వంటి వారు మాత్రమే కనిపిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 31, 2024 12:56 pm

Jagan

Follow us on

Jagan: జగన్ వస్తే జనం తండోపతండాలుగా వస్తారు. అందున పులివెందుల వచ్చారంటే ఈ స్థాయిలో వస్తారో తెలియంది కాదు.అయితే ఎందుకు అక్కడ పరిణామాలు మారిపోయాయి.ఇప్పుడు జగన్ వస్తే జనాలు పెద్దగా రావడం లేదు. వైసీపీ శ్రేణులు అయితే కామన్ గా వచ్చి పోతున్నారు. కానీ జిల్లా ప్రజలు మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.గత మూడు రోజులుగా జగన్ పులివెందులలో గడుపుతున్నారు.అయితే జనాలు పెద్దగా రాకపోవడంతో ఆయన గృహం వెలవెలబోతోంది. దీంతో జగన్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ ఫేమ్ గణనీయంగా పడిపోయింది.సొంత పార్టీ శ్రేణులు సైతం పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో నన్న ఆందోళనతో ఉన్నారు. ప్రజలు మరోసారి ఛాన్స్ ఇస్తారా?ఇవ్వరా? అన్న అనుమానం కూడా వెంటాడుతోంది. దీనికి తోడు రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది.రోజుకో మలుపు తిరుగుతోంది.విజయమ్మ సైతం జగన్ వైఖరిని తప్పు పట్టేలా సంకేతాలు ఇచ్చారు.ఆ ప్రభావం కడప జిల్లా పై పడింది. అందుకే జగన్ పర్యటనను పెద్దగా జనాలు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.

* ఆ నేతలే తప్పించి
ప్రస్తుతం జగన్ పులివెందులలో ఉన్నారు.జగన్ చుట్టూ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు వంటి వారు మాత్రమే కనిపిస్తున్నారు. వారు కొద్దిపాటి జనం తీసుకొచ్చి పరవాలేదనిపిస్తున్నారు. అయితే అలా వస్తున్న జనం కూడా ఎక్కువ సమయం అక్కడ ఉండడం లేదు. దీంతో జన సమీకరణ పై జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* ఐదేళ్లుగా ప్రాధాన్యం లేక
గత ఐదేళ్లలో జిల్లా ప్రజలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు జగన్. వారి సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గం చూపలేదు. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చామన్న ధోరణితో ఉండేవారు. వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఓడిపోయిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రజలు ముఖం చాటేశారు. ఇప్పుడు సమస్యలను విన్నవించినా ఏం చేస్తారని.. పరిష్కార మార్గం ఎలా చూపిస్తారని ఎక్కువమంది ప్రజలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం జగన్ ను చూసేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. ఇప్పుడు వెళ్లిన వేస్ట్ అన్నభావనతో వారు ఉన్నారు. మొత్తానికైతే జగన్ కు జనాకర్షణ తగ్గింది. అది కూడా పులివెందులలోనే కావడం విశేషం.