Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: మద్దతు ఇచ్చారు సరే.. ఈ వకాల్తా ఏంటి జగన్

YS Jagan Mohan Reddy: మద్దతు ఇచ్చారు సరే.. ఈ వకాల్తా ఏంటి జగన్

YS Jagan Mohan Reddy: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి షాక్. కానీ ఇది ముందే ఊహించినదే. కనీసం కేంద్ర పెద్దలు ఇతర పార్టీలపై ఒత్తిడి చేయలేదు. కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశాయి. కానీ ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఈ బిల్లును గట్టిగానే ఎదుర్కొన్నాయి. సహజంగానే ఇది బిజెపికి ఆగ్రహం తెప్పించే అంశం. ఆపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దీనిపై ఆగ్రహంతో స్పందించాలి. కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లు అడ్డుకోవడంపై ప్రతిపక్షాలను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయి అని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగానే మాట్లాడుతుండడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని చాలా రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. వాటిని కాదని జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆ బిల్లులు ఆగిపోయిన జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న.

* కేంద్ర పెద్దలు చెప్పినా..
దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని కేంద్ర పెద్దలు గట్టిగానే చెప్పుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అది అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నది వారి వాదన. ఎందుకంటే 2011 తర్వాత మాత్రమే జనాభా నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. దక్షిణాది రాష్ట్రాలు అమలు చేయడంతో.. జనాభా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు తాజాగా జన గణన చేసి నియోజకవర్గాల పునర్విభజన కెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందికర పరిస్థితులు ఖాయం. అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ ఏపీలో మూడు పార్టీలు తప్ప మిగతా రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అయితే చంద్రబాబుతో పాటు పవన్ సరే.. ఎందుకంటే వారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి.. కానీ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడాన్ని మిగతా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తప్పు పడుతున్నాయి.

* మద్దతు వరకు సరే..
ఎన్డీఏకు మద్దతు ఇచ్చినది చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. కేంద్ర ప్రభుత్వం తరఫున వకాల్త పుచ్చుకున్నారు. మిగతా రాజకీయ పక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించడాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసమేనని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తనపై ఉన్న కేసులను నీరు గార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న.. చివరకు తనకు పార్టీకి ఇబ్బంది వస్తున్న అడ్డగోలుగా మద్దతు తెలుపుతున్నారన్నది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. చంద్రబాబుతో పాటు పవన్ సైలెంట్ గా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎమోషన్ కావడం కొత్త ప్రచారానికి తెర తీస్తోంది. అయితే జగన్ తీరుతో జాతీయస్థాయిలో ఆయన ఏకాకి కావడం ఖాయం అని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular