YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత జగన్( Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జనాల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. 2014 నుంచి 2019 మధ్య ఎలా ప్రజలతో మమేకమై పని చేశారు.. అలానే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జగన్ లండన్( London) వెళ్లేందుకు తాజాగా హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్పోర్ట్( passport) మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 16న లండన్ లో జరగనున్న కుమార్తె గ్రాడ్యుయేషన్ డేకు జగన్ సతీ సమేతంగా హాజరుకానున్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు ఆయన లండన్ లోనే ఉండనున్నారు. గతంలో విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరగా రకరకాల ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. అయితే ఆయన విదేశాలకు వెళుతూ వెళుతూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
* సమూల ప్రక్షాళన
ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. కొన్ని కీలక నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చారు. చాలా జిల్లాలకు కొత్త అధ్యక్షులను సైతం నియమించారు. రీజనల్ కోఆర్డినేటర్లను( regional coordinators ) సైతం భర్తీ చేశారు. ఇప్పుడు ఏకంగా జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే.. ఈనెల 29 నుంచి జిల్లాల పర్యటన( district Tours) ప్రారంభమయ్యేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఏదైనా కారణాలతో వాయిదా పడితే మాత్రం ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి మూడో వారం నుంచి ప్రజల్లోకి వస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ పర్యటనతో( foreign tour) అనేక రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ తన జిల్లాల పర్యటన విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు జగన్.
* పార్టీ శ్రేణులతో మమేకం
రాష్ట్రంలో 25 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ పరిధిలో వారానికి రెండు రోజులపాటు కార్యక్రమాలు ఫిక్స్ చేశారు. పార్టీ శ్రేణులతో సమీక్షలు, కార్యకర్తలతో మమేకమయ్యేలా జగన్( Jagan Mohan Reddy ) ప్లాన్ చేసుకున్నారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, గత ఎన్నికలవేళ కేడర్ తో వచ్చిన గ్యాప్ భర్తీ చేసుకునేలా జగన్ తన జిల్లాల పర్యటనను కొనసాగించనున్నారు. ఆ రెండు రోజులు ప్రతి నియోజకవర్గంలోని నేతలతో లోటుపాట్లపై మాట్లాడుతారు జగన్. గతంలో నియోజకవర్గ సమీక్షల సమయంలో కీలక నేతల తో భేటీకి పరిమితం అయ్యేవారు. కానీ ఈసారి నేతలతో పాటు కార్యకర్తలను సైతం జగన్ పలకరించనున్నారు.
* వారానికి రెండు రోజులపాటు
25 పార్లమెంటు స్థానాల పరిధిలో వారానికి రెండు రోజులపాటు కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అవసరం అనుకుంటే మరో రోజు అదనంగా కేటాయించేందుకు సైతం జగన్ సిద్ధపడుతున్నారు. అయితే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు( budget sessions ) జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది స్పష్టత లేదు. కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు జగన్. గతం మాదిరిగా ప్రజలతో మమేకమై పనిచేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఒకవైపు, పార్టీ బలోపేతం మరోవైపు అన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ys jagan mohan reddy going to london with court permission
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com