Site icon OkTelugu

YCP target Rashmi Gautam: వైసిపి టార్గెట్ రష్మి గౌతమ్!

YCP target Rashmi Gautam

YCP target Rashmi Gautam

YCP target Rashmi Gautam: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ గుణపాఠాలు నేర్చుకోదు. ఆ పార్టీలో తప్పుల దిద్దుబాటు అనేది కనిపించదు. ఆ పార్టీ నేతల తప్పులను గుర్తిస్తే వారు సహించలేరు. ఎదురుదాడికి సిద్ధమవుతారు. ఇప్పుడు యాంకర్ రష్మి గౌతమ్ విషయంలో జరుగుతోంది అదే. జంతు హింసపై ఆమె ఇటీవల చేశారు కొన్ని రకాల వ్యాఖ్యలు. దానిపై సమాధానం ఇవ్వకుండా.. ఆమె విషయంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు. అదే పనిగా సినిమాల్లో నటించిన క్లిప్పింగులు పెడుతూ అసభ్య వ్యాఖ్యలతో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా స్పందన వస్తుందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె దూకుడుగా ముందుకు వెళ్లకుండా.. ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెబుతున్నారు.

డీజిల్ కొరతపై ఆందోళనలో
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీజిల్ కొరతపై ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతిలో జరిగిన ఆందోళనలో నాటు బండిపై ఆటోను పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ బండి పై ఆటో తోపాటు కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిలబడ్డారు. అయితే ఆ నాటు బండికి సంబంధించి ఎత్తు లాగేందుకు ఇబ్బంది పడింది. జంతు ప్రేమికురాలు అయిన రష్మి గౌతమ్ దీనిపై స్పందించారు. అదే పరిస్థితి మీకు వస్తే అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు సోషల్ మీడియా వేదికగా.

వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ..
అయితే ఇప్పుడు రష్మీ గౌతంపై విపరీతంగా రెచ్చిపోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు. ఆమె సినిమాల్లో నటించిన క్లిప్పులను సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం. గతంలో కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైనే మాట్లాడారు రష్మి గౌతమ్. ఆమె గొప్ప జంతు ప్రేమికురాలు కూడా. అలా బాధ్యతతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. కానీ వైసీపీ నుంచి ఈ తరహా సమాధానాలు వస్తాయని ఆమె ఊహించారు. అందుకే ఒక పద్ధతి ప్రకారం మాత్రమే స్పందిస్తున్నారు.

Exit mobile version