Site icon OkTelugu

Professor Nageshwar YCP Paytm Comments: వైసిపి పేటీఎం.. తేల్చి చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్!

Professor Nageshwar YCP Paytm Comments

Professor Nageshwar YCP Paytm Comments

Professor Nageshwar YCP Paytm Comments: ప్రొఫెసర్ నాగేశ్వర్.. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వినిపించే మాట ఇది. అత్యుత్తమ రాజకీయ విశ్లేషకుడిగా చెరగని ముద్ర ఆయన సొంతం. ఏదైనా అంశంపై విశ్లేషించారంటే అందులో ఉన్న లోటు పాట్లను ఇట్టే చెబుతారు. ఎవరిని నొప్పించే పరిస్థితి ఉండేది కాదు. క్లాస్ రూమ్ లో పాటలు చెబితే విద్యార్థులు శ్రద్ధగా వినేవారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేవారు. టీవీ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొంటే ఎంతగానో ఆసక్తిగా చూసేవారు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యారు అంటే ఆయన స్టామినా అటువంటిది. ఏ పార్టీ వారితోనైనా మంచి అనుబంధం కొనసాగించడం ఆయనకే సొంతం. దశాబ్దాలుగా రాజకీయ విశ్లేషణలో చెరగని ముద్ర అయినది. కానీ ఇటీవల ఆయన విశ్లేషణలో భాగంగా వెల్లడించిన అంశాలపై క్షమాపణలు చెప్పారు. బే షరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

* రాజకీయ వివాదం..
కొద్ది రోజుల కిందట ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన అంశాన్ని బయటపెట్టారు. తన విశ్లేషణలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారని.. తన పార్టీకి చెందిన సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భేటీలో పాల్గొన్నారని.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారని.. అందుకు అమిత్ షా తిరస్కరించారని.. చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్.. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ తేల్చారని.. క్లాస్ కూడా పీకారని చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏపీ రాజకీయాల్లో ఇదో కుదుపుగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన తో పాటు టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో నాగేశ్వర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి.

* సోషల్ మీడియాలో ప్రచారంపై..
ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేటీఎం అంటూ ప్రచారం మొదలైంది. ఇంకోవైపు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదయింది. 24 గంటల లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పోలీస్ కేసుతో చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని జనసేన హెచ్చరించింది. దీంతో ఓ టీవీ ఛానల్ ద్వారా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అయినా సరే సోషల్ మీడియాలో నాగేశ్వర్ కు వ్యతిరేకంగా ప్రచారం ఆగడం లేదు. ఈ తరుణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నాగేశ్వర్. గతంలో ఇదే చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తనకు మద్దతు తెలిపారని.. గతంలో పవన్ కళ్యాణ్ తటస్థులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తనను ప్రత్యేకంగా పిలిచారని.. బిజెపి అగ్ర నేతలు అంత టచ్ లో ఉంటారని.. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనను మొన్నటికి మొన్న వ్యతిరేకించానని.. అటువంటి తనపై పేటీఎం ముద్ర వేయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఒక యుద్ధంతో పోల్చిన ఆయన.. కచ్చితంగా దీనికి సమాధానం చెబుతానని హెచ్చరించడం విశేషం.

Exit mobile version