Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » With that one decision ntr became a political hero

NTR : ఆ ఒక్క నిర్ణయంతో పొలిటికల్ హీరోగా ఎన్టీఆర్

ఏపీలో మహిళల అక్షరాస్యత పెరిగింది ఎన్టీఆర్ హయాంలోనే. ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలతో మహిళలు అగ్రగామిగా నిలవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించారు. అమలుచేసి చూపించారు. దటీజ్ ఎన్టీఆర్.

Written By:Dharma Raj, Updated On : May 28, 2023 / 10:51 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
With That One Decision Ntr Became A Political Hero

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

NTR : దేశంలో మహిళలు తలెత్తకునేలా చేసిన రాష్ట్రం ఏపీ. మహిళాభ్యున్నతికి దిక్సూచిగా నిలిచింది కూడా ఏపీయే. అందులో కీలకమైనది మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు. దేశంలో ఇటువంటి సరికొత్త ఆలోచన చేసింది కూడా మన రాష్ట్రమే.  అప్పటివరకూ భూ ధ్రువపత్రాల్లో ఎక్కడా మహిళల పేరు కనిపించేది కాదు. దీనిని మార్పుచేశారు నందమూరి తారక రామారావు. దేశంలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికింది ఎన్టీఆరే. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయమే మహిళలకు ఆస్తి హక్కు. ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఆ నిర్ణయం దేశ వ్యాపితమైంది.

కాంగ్రెస్ పాతకాలం నాటి విధానాలపై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టారు. సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టారు. రూ.2లకే కిలో బియ్యం పథకం, గృహనిర్మాణం వంటి వాటికి ఎన్టీఆర్ భీజం వేశారు. దానిని కొనసాగించారు. వినూత్న కార్యక్రమాలతో పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా సామాజిక రుగ్మతలపై కూడా దృష్టిసారించారు. అందులో భాగమే మహిళలకు ఆస్తిహక్కు. సీఎం అయిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం లోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అంతకుముందు మహిళలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. తల్లిదండ్రులు ప్రత్యేకంగా కుమార్తెలకు రాసిస్తే తప్ప వాటా వచ్చేది కాదు. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి కుమారులకు మాత్రమే దక్కేది. దానిని ఎన్టీఆర్‌ మార్చి కుమార్తెలకు కూడా సమాన హక్కు కల్పించారు.

ఈ నిర్ణయంతో దేశం యావత్ ఏపీ వైపు చూడడం ప్రారంభించింది. మహోన్నత నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించడం ప్రారంభమైంది. సామాజిక రుగ్మతపై ఎన్టీఆర్ కొట్టిన దెబ్బతో అటు మహిళాలోకం సైతం మురిసిపోయింది. అప్పటివరకూ సినీచరిష్మతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ ఒక్క నిర్ణయంతో పాలనలోనూ తనకు పట్టుందని నిరూపించుకున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చట్టం కదా అని కాంగ్రెస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడకు పదేళ్ల తరువాత అదే కేంద్ర ప్రభుత్వం మహిళకు ఆస్తి హక్కు చట్టం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

ఒక్క మహిళలకు ఆస్తి చట్టమే కాదు. చాలా పథకాలు, నిర్ణయాల్లో ఎన్టీఆర్ మహిళల పక్షపాతిగా నిలిచారు.  దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక విశ్వ విద్యాలయాన్ని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేశారు. తిరుపతిలో పద్మావతి పేరుతో వర్సిటీ నెలకొల్పారు. అప్పట్లో ఇదొక సహసోపేత నిర్ణయం. ఇక అన్ని విద్యా సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీలో మహిళల అక్షరాస్యత పెరిగింది ఎన్టీఆర్ హయాంలోనే. ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలతో మహిళలు అగ్రగామిగా నిలవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ రూపొందించారు. అమలుచేసి చూపించారు. దటీజ్ ఎన్టీఆర్.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

View Author's Full Info

Web Title: With that one decision ntr became a political hero

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • ntr
  • Reservations
  • Woman Assets Law
  • Women Literacy
  • Women University
Follow OkTelugu on WhatsApp

Related News

Abdul Kalam : ‘అబ్దుల్ కలాం’ బయోపిక్ లో ధనుష్..లుక్స్ చూస్తే మెంటలెక్కిపోతారు!

Abdul Kalam : ‘అబ్దుల్ కలాం’ బయోపిక్ లో ధనుష్..లుక్స్ చూస్తే మెంటలెక్కిపోతారు!

NTR : తారక్ కి చెక్ పెట్టడానికే యంగ్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నారా..?

NTR : తారక్ కి చెక్ పెట్టడానికే యంగ్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నారా..?

NTR : క్రేజీ బయోపిక్ లో ఎన్టీఆర్? బాలీవుడ్ లో హాట్ టాపిక్!

NTR : క్రేజీ బయోపిక్ లో ఎన్టీఆర్? బాలీవుడ్ లో హాట్ టాపిక్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

Balayya and NTR : బాలయ్య – ఎన్టీయార్లను  కలుపుతున్న స్టార్ డైరెక్టర్…

Balayya and NTR : బాలయ్య – ఎన్టీయార్లను కలుపుతున్న స్టార్ డైరెక్టర్…

Nandamuri Janakiram Son: నందమూరి వంశం నుండి మరో హీరో ఎంట్రీ..మొదలైన మొదటి సినిమా పూజా కార్యక్రమాలు!

Nandamuri Janakiram Son: నందమూరి వంశం నుండి మరో హీరో ఎంట్రీ..మొదలైన మొదటి సినిమా పూజా కార్యక్రమాలు!

NTR and Kalyan Ram : అన్నయ్య కొడుకు మొదటి సినిమా లాంచ్ కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ డుమ్మా..కారణం అదేనా?

NTR and Kalyan Ram : అన్నయ్య కొడుకు మొదటి సినిమా లాంచ్ కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ డుమ్మా..కారణం అదేనా?

Chiranjeevi and Balayya : ఆ పాటకు చిరంజీవి, బాలయ్య డాన్స్ చేస్తే చూడాలని ఉంది.. ఎన్టీఆర్ క్రేజీ కామెంట్స్

Chiranjeevi and Balayya : ఆ పాటకు చిరంజీవి, బాలయ్య డాన్స్ చేస్తే చూడాలని ఉంది.. ఎన్టీఆర్ క్రేజీ కామెంట్స్

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.