Site icon OkTelugu

Balasubrahmanyam to join YSRCP: ఆ టిడిపి నేత ఎటువైపు.. గట్టి ప్రయత్నాలు చేస్తున్న రెండు పార్టీలు!

Balasubrahmanyam to join YSRCP

Balasubrahmanyam to join YSRCP

Balasubrahmanyam to join YSRCP: రాయలసీమలో(Rayalaseema ) పొలిటికల్ సీన్ మారుతోంది. అక్కడ ఎలాగైనా పట్టు సాధించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టిడిపి కంటే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఓ మూడు సీట్లు తప్పించి.. మిగతా చోట్ల సూపర్ విక్టరీ కొట్టింది. 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా దెబ్బతింది. అందుకే తమ పార్టీకి ఆయువుపట్టుగా భావిస్తున్న రాయలసీమలో తిరిగి పూర్వవైభవం సాధించే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ఓ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఏడాది కూటమిపాలన పూర్తయిన క్రమంలో రాయలసీమలో వైసిపి పుంజుకుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడ బలపడాలన్న ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

కొద్ది రోజుల కిందటే రాజీనామా..
టిడిపిలోని( Telugu Desam Party) అసంతృప్తి నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలను టార్గెట్ చేసింది. వారికి రకరకాల ఆఫర్లను చూపి పార్టీలో చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల టిడిపికి మాజీ ఎమ్మెల్యే సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపిలో నెలకొన్న వర్గ విభేదాలతో బాలసుబ్రమణ్యం ఇటీవల టిడిపికి రాజీనామా చేశారు. వాస్తవానికి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి చవిచూశారు. ఓడిపోయిన తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్టీలో ఆయన వ్యతిరేకులకు పెద్దపీట వేస్తుండడంతో.. పార్టీని వీడడం మేలు అన్న నిర్ణయానికి వచ్చారు. రాజీనామా చేస్తూ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు.

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
సుగవాసి బాలసుబ్రమణ్యం( Balasubrahmanyam ) తండ్రి పాలకొండ్రాయుడికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. వారితో పాటే తొలిసారిగా 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం టిడిపిలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సుబ్రహ్మణ్యం. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి బలమైన హామీ..
మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అధికారికంగా పార్టీలో చేరుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.మరువైపు సుగవాసి బాలసుబ్రమణ్యం బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అందుకే ఆయన కోసం జనసేన సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎటువైపు వెళ్తారో చూడాలి.

Exit mobile version