Raghu Rama Krishna Raju: పోలింగ్ తర్వాత ఖుషి గా కనిపించారు రఘురామకృష్ణం రాజు. అనూహ్యంగా ఎన్నికల ముంగిట టిడిపిలో చేరి ఉండి టికెట్ను సొంతం చేసుకున్నారు. తన శపధం నెరవేరబోతుందని.. తాను భావిస్తున్నట్లే అనుకూల ఫలితాలు వస్తాయని తేల్చి చెబుతున్నారు.అయితే ఏపీలో ఎన్నికల ముగిసి రెండు రోజులు అవుతున్నా వేడి మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి శ్రేణులపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వైసీపీ సైతం ప్రతిఘటించడంతో దాడులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. గెలిచిన ఆరు నెలలకే నాయకత్వంతో విభేదాలు పెంచుకున్నారు. అది తారాస్థాయికి చేరి రఘురామకృష్ణంరాజు ప్రతిపక్షాల పంచన చేరారు. ఎన్నికల్లో బిజెపి తెలుగుదేశం పార్టీ ఓటమిలోకి రావడానికి రఘురామకృష్ణం రాజు కూడా ఒక కారణమయ్యారు. అయితే అది రఘురామకృష్ణం రాజును వైసీపీ సర్కార్ వెంటాడింది. కేసులతో వేధించింది. పుట్టినరోజు నాడే సిఐడి హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు చేయి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో రఘురామ శపథం చేశారు. అరాచక వైసీపీ సర్కార్ కు సాగనంపే వరకు నిద్రపోనని సవాల్ చేశారు.
ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం రఘురామకృష్ణం రాజు స్పందించారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ రాజకీయ చిత్రపటంలో ఇక వైసిపి కనబడదని తేల్చి చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. ఈసారి ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు జగన్కు చెంపపెట్టు అని తేల్చి చెప్పారు. ప్రజలు వైసీపీని ముంచేసారని.. కూటమిని ఆదరించారని చెప్పిన రఘురామరాజు జోష్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.