Visakhapatnam Water Emergency: విశాఖ నగరంలో( Visakhapatnam City) వాటర్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోయింది. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను నిలిపివేశారు. 30 గంటలకు పైగా సమ్మె కొనసాగుతుండడంతో దాదాపు నగరం వ్యాప్తంగా ఉన్న తాగునీటి ట్యాంకులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. దీంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో విశాఖ నగరవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. బిందెడు నీరు కూడా లభ్యం కాకపోవడంతో ప్రజలు బాధపడాల్సి వస్తోంది. దాదాపు నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
* ట్యాంకులు నింపాలంటే 10 గంటలు
విశాఖ నగరంలో తాగునీటి ట్యాంకులు( water tanks) నింపాలంటే దాదాపు 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వారు సమ్మెబాట పట్టేందుకు సిద్ధపడ్డారు. కానీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టడంతో సచివాలయ ఉద్యోగులతో బ్యాంకులు నింపాలని చూస్తున్నారు జీవీఎంసీ అధికారులు. ఇంకోవైపు ఉద్యోగులతో పాటు కార్మికులతో చర్చలు జరిపారు. కానీ అవి విఫలమయ్యాయి.
* 98 డివిజన్లలో సైతం
విజయనగరం జిల్లా తాటిపూడి రైవాడ, ఏలేరు, గంభీరం కెనాల్స్ నుంచి గ్రేటర్ విశాఖ నగరానికి నీటి సరఫరా జరుగుతుంటుంది. ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వస్తుంది. 98 డివిజన్లకు గాను లక్షల లీటర్ల తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు, కార్మికులు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. అయితే ఉద్యోగులతో పాటు కార్మికులు విధులను బహిష్కరించడంతో విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ వచ్చి పడింది.