Vijayasai Reddy: విజయసాయిరెడ్డి తనకు తాను తెలివైన మనిషిగా భావిస్తారు. ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఎందుకంటే ఆయన తెలివైన మాటలు చెప్పడం ప్రారంభించి పుష్కర కాలం దాటింది.జగన్ కోసం, వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన శ్రమ, బాధఅందరికీ తెలిసిందే.వైసిపి కోసం ఆయన ఏకంగా ఢిల్లీ పెద్దల ఎదుట సాగిలాలు పడేఅలవాటు ఆయనది. టిడిపి బిజెపికి ఎప్పుడు దూరమవుతుందా? వైసీపీని ఎప్పుడు దగ్గర చేర్చుతానా? అని అప్పట్లో ఆయన తాపత్రయపడ్డారు. అందులో సక్సెస్ అయ్యారు. ఏకంగా కేంద్ర పెద్దలను పొగిడేందుకు తన సోషల్ మీడియా ఖాతాను ఒక ఏజెన్సీకి అప్పగించారు. ఒకే సమయంలో రాష్ట్ర రాజకీయాలతో పాటు ఢిల్లీ రాజకీయాలను శాసించారు. అయితే ఆయన చర్యలు ప్రజలకు అలవాటయ్యాయి. ఆయన కొత్తగా చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కానీ అదే పనిగా ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పాలన చేతకాక చేతులెత్తేసారని విమర్శలు చేశారు. అయితే గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కూటమి నేతలు విజయసాయి రెడ్డికి సూచిస్తున్నారు. నిజాలు గుర్తు చేసుకుంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆయనకే తెలియాలి అని ఎద్దేవా చేశారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
*గత ఐదేళ్ల జగన్ పాలనలో చంద్రబాబు,అచ్చెనాయుడు, రఘురామకృష్ణంరాజు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు లాంటి నేతలను ఎలా వేధించారు విజయసాయి రెడ్డికి తెలియదా?
*వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఆ సమయంలో గుండెపోటు అని విజయసాయిరెడ్డి చెప్పలేదా?మీడియా ముందుకు వచ్చి అదే వాదనలు వినిపించలేదా?
*వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు.ఇంటికి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు.అదివ్యవస్థీకృత నేరమని అనిపించలేదా?
*జగన్ పాలనలో ఉద్యోగ సంఘాల నేతలను వేధించడం,ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా రోడ్డుపై నిలబెట్టడం నిజం కాదా?
* అమరావతి రాజధానిని విస్మరించినప్పుడు గుర్తుకు రాలేదా? లక్షల కోట్లు అప్పులు తెచ్చినప్పుడు తప్పు అనిపించలేదా? ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినందుకా? రుషి కొండపై 500 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నందున..
* జగన్ సోషల్ మీడియా వారియర్స్, వాలంటీర్లతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు విజయసాయిరెడ్డికి తప్పు అనిపించలేదా?
* విజయసాయి ఉక్కిరి బిక్కిరి
ఈ ప్రశ్నల పరంపరతో విజయసాయిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎదుటి వారిపై విమర్శ చేసే ముందు నీ వీపు చూసుకోవాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి అబద్ధాలు చెప్పారని.. ఇక మీ మాటలను నమ్మి పరిస్థితులు ఎవరూ లేరని తటస్తులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి చూస్తుంటే.. కూలీ డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.