Vijaya Sai Reddy : రాజకీయాలు చేయలేనని చెప్పి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకటి రెండు రోజులు చేశారు కూడా. అందుకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తరువాత ఆయన ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియదు కానీ.. పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఇంతలో ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించిన వనరు ఇచ్చారు. వైసిపి నేతల చిట్టా ఇవ్వడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అరెస్టుల పర్వం కొనసాగించింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చెప్పారట.. మద్యం కుంభకోణంలో అరెస్టులట అంటూ తేలిగ్గా మాట్లాడేశారు. మద్యం కుంభకోణంలో ఐదో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని కాదని.. మిగతా వారి అరెస్టు జరగడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.
* జగన్ కోటరీ పై మాట్లాడుతునే..
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) జరిగిన ఓ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అక్కడ రెడ్డిక సంక్షేమ సంఘ కార్యాలయానికి భారీగా విరాళం ఇచ్చారు. తాను ఎప్పుడూ ఆప్షన్ గా ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి కోటరి పై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను పొగిడేందుకు ప్రయత్నించారు. తనకు ఆయనతో 20 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని.. భవిష్యత్తులో అననని చెప్పారు. అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని కూడా తేల్చి చెప్పారు. అయితే అది ఎవరి కోసం? తనకోసం తాను వస్తారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం వస్తారా? అన్నది మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీల్లో ఉన్న ఏకైక ఆప్షన్ విజయసాయిరెడ్డికి వన్ అండ్ ఓన్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* వైయస్సార్ కాంగ్రెస్ ఏకైక ఆప్షన్..
ఎవరైనా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీలో పని చేస్తారు. గతంలో పనిచేసిన పార్టీలో సులువుగా సర్దుబాటు కాగలరు. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ప్రకటన చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం 18 నెలల కూటమి అధికారం పూర్తవుతుంది. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే ప్రయత్నాల్లో పడ్డారు. మొన్న ఆ మధ్యన విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డిని టచ్ చేయకపోవడం జగన్మోహన్ రెడ్డిలో అనుమానం పెంచుతోంది. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి.. తరచూ రాజకీయాల గురించి.. పొలిటికల్ రీయంట్రీ గురించి మాట్లాడుతుండడం మాత్రం ఆయనలో ఉన్న ఆశలను తెలియజేస్తోంది.