Arogyasri : ఆరోగ్యశ్రీ అంటేనే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. దేశంలో విప్లవాత్మక పాలనకు నాంది పలికింది కూడా ఆయనే. పేదవారికి వైద్యం , విద్య అందితే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని భావించిన నేత రాజశేఖర్ రెడ్డి.అందుకే ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను తీసుకొచ్చారు.పేదవాడికి విద్యను దగ్గరకు చేర్చారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కష్టకాలంలో ఆసుపత్రిని ఆశ్రయించే పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించారు. 108 అంబులెన్స్లను తీసుకొచ్చి అత్యవసర, అనారోగ్య సమయాల్లో బాధపడే వారికి ఆసుపత్రుల్లో చేర్పించారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు.. దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. తమ రాష్ట్రాల్లోప్రవేశ పెట్టక అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా రాష్ట్రాలు ఏపీని అనుసరించాయి. అయితే రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని కొనసాగించాయి. జగన్ సర్కార్ అయితే ఆరోగ్యశ్రీ సాయాన్ని ఐదు లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. కానీ చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీని తొలగిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక పథకాలకు మంగళం పలకనుందన్న టాక్ నడుస్తోంది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో.. ఇక ఆరోగ్యశ్రీ అవసరం లేదని కొందరు టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. తాజాగా ఆరోగ్యశ్రీ విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ ఉండగా.. ఆరోగ్యశ్రీ దండగ అన్న మాదిరిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీని ఎక్కడ ఎత్తివేస్తుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
* ఆ మహానేత శ్రీకారం
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కలియతిరి గారు. అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కానీ ఎక్కువమంది ఆరోగ్యపరమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్వతహాగా డాక్టర్ అయిన రాజశేఖర్ రెడ్డి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎలా అని అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వచ్చిన ఆలోచన ఆరోగ్యశ్రీ. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించాలని సంకల్పించారు. అప్పుడే ఫీజు రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టారు. 104, 108 అంబులెన్స్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ పథకాలు ఆదర్శం అయ్యాయి.
* కొనసాగించిన ప్రభుత్వాలు
రాజశేఖర్ రెడ్డి తర్వాత బాధ్యతలు స్వీకరించిన రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించారు. బడ్జెట్లో సైతం కేటాయింపులు చేశారు. అయితే జగన్ ఏకంగా ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు. అయితే ఇది హర్షించదగ్గ పరిణామమే అయినా.. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం జగన్ జాప్యం చేశారు. ఎప్పటికప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీరియస్ నెస్ తగ్గింది. ఆ ప్రభావం వైద్య సేవలపై పడింది.
* తెరపైకి ఆయుష్మాన్ భారత్
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనసాగిస్తుంది. ఈ పథకంలో భాగంగా అడ్మిట్ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందనుంది. అయితే ఇప్పటికే ఆరోగ్యశ్రీ అమలవుతుండడంతో ఏపీ ప్రజలు ఆయుష్మాన్ భారత్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటే కొంతవరకు నిధులు ఆదా చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పలకనుంది అన్న వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Union minister of state pemmasani chandrasekhars comments on arogyashri dandaga while ayushman bharat is going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com