AP Fake Liquor Case: ఏపీలో( Andhra Pradesh) కల్తీ మద్యం కలకలం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సైతం నకిలీ మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున దొరకడం ఆందోళన రేకెత్తించింది. అక్కడి నుంచి నకిలీ మద్యం వ్యవహారంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటూ వస్తోంది. అయితే దీనిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ యు ట్యూబర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లా బకాస్ అనే యూట్యూబర్, విలేకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించారు.
* నంద్యాల జిల్లా వాసి..
యూట్యూబ్ ఛానల్( YouTube channel) తో పాటు విలేకరిగా ఉండేవారు అల్లా బకాస్. ఈయన స్వస్థలం నంద్యాల జిల్లాలోని జిల్లెల్ల. నకిలీ మద్యం కేసులో 16వ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్నారు అల్లా బకాష్. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఏడాది కిందట నంద్యాలకు వెళ్లారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని విలేకరిగా చలామణి అవుతున్నారు. అయితే అల్లా బకాష్ హైదరాబాద్ లకిడికపూల్ లో ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ లో కల్తీ మద్యం లేబుల్స్ తయారు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు గాను నిందితుల వద్ద నుంచి అల్లా బకాష్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు అందమని గుర్తించారు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట విజయవాడలో అల్లా బకాస్ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. లేబుల్స్ దొరకడంతో అదుపులోకి తీసుకున్నారు.
* రాజకీయ దుమారం..
కల్తీ మద్యం పై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికారిక టిడిపి కూటమి వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉంది. మరోవైపు నకిలీ మద్యం గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చింది. అయితే మద్యం లేబుళ్లపై క్యూఆర్ కోడ్ ఉండేదని.. వైసిపి హయాంలో అది కొనసాగిందని.. టిడిపి కూటమి హయాంలో దానిని తీసేసానని ఆక్షేపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మళ్లీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.