Tirumala Darshan Updates:తిరుమలలో ( Tirumala)భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల అనంతరం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం నాడు 77,481 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 30,612 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా రూ.3.96 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల నుంచి 20 గంటల వరకు సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
Also Read: బంగాళాఖాతం నుంచి హెచ్చరిక.. ఏపీ వైపు ప్రళయం!
భక్తులకు సౌకర్యాలు మెరుగు..
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలని టిటిడి( Tirumala Tirupati Devasthanam) నిర్ణయించింది. ముఖ్యంగా టోకెన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని భావించింది. త్వరితగతిన శ్రీవారి దర్శన టికెట్లు దారి చేయడానికి వీలుగా తిరుమలలో కొత్తగా దర్శనం టికెట్ల కేంద్రం ఏర్పాటు చేసింది. దీని నిర్మాణం కోసం టీటీడీ 60 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు దీనిని ప్రారంభించారు. భక్తుల కోసం ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read:ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలట?
వారికి ఇక గదులు కుదరవు
మరోవైపు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి.. సిఫారసు లేఖలతో గదులు ఇవ్వడం ఇకపై కుదరదు. టీటీడీ ఈ విధానాన్ని రద్దు చేసింది. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో పొందుతారు. వీరు నేరుగా దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలామంది సిఫారసు లేఖలతో గదులు పొందుతున్నారు. ఇది మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 300 రూపాయల టికెట్లు ఉన్న సుదూర ప్రాంత భక్తులకు మాత్రమే సిఫారసు లేఖలపై గదులు ఇస్తారు. అయితే శ్రీవాణి టిక్కెట్లు పొందిన భక్తులు రెండు మూడు గదులు తీసుకుంటున్నారు అన్న ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మాత్రమే గదులు కేటాయించనున్నారు.