Three YCP MPs joining BJP: మళ్లీ కూటమిలో చేరికలు మొదలయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మళ్ళీ పార్లమెంటు ముంగిటకు రానుంది. ఏపీలో దాదాపు 80 అసెంబ్లీ సీట్లతో పాటు 13 పార్లమెంటు సీట్లు పెరగనున్నాయి. అదే జరిగితే అధికార కూటమికి అభ్యర్థులు అవసరం ఉంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలోనే జనసేన చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు బిజెపి సైతం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
కేవలం అవసరాల కోసం..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో నలుగురు ఎంపీలు, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిపై బిజెపి గురి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వారు సైతం అవసరాల కోసం బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు వినిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగారు ఈ ఇద్దరు తండ్రి కొడుకులు. కానీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది.
జగన్ కుటుంబ సభ్యులు..
మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అవినాష్ రెడ్డి. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి బిజెపితో ఉన్న స్నేహంతో అవినాష్ రెడ్డి బయటపడ్డారు. కానీ ఇప్పుడు వైసీపీ విషయంలో బిజెపి అభిప్రాయం మారింది. కోర్టు కూడా మళ్లీ విచారణ మొదలు పెట్టాలని సిబిఐ కు ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్ కావడం ఖాయం. అందుకే ఆయన సైతం బిజెపిని ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సైతం బిజెపికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీటీడీ లడ్డు కల్తీ కి సంబంధించి అభియోగాలు మోపుతూ విచారణ లోతుగా సాగింది. సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.. అందుకే ఆయన సైతం బిజెపి వైపు వచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
ఛాన్స్ లేదు..
అయితే ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. వారు పార్టీ మారుతారు అంటే అంత సులువు కాదు. పైగా వీరి అవసరం బిజెపికి ప్రస్తుతం లేదు. మీరు బిజెపిలో కేవలం ఇబ్బందులను దృష్ట్యా వెళ్తారే తప్ప.. వీరికంటూ వైసీపీపై ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా టిడిపి నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బిజెపిలో చేరే అవకాశం లేనట్టు చాలామంది కొట్టి పారేస్తున్నారు.
