AP politics Updates: ఏపీలో( Andhra Pradesh) తిరుమలలో లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందన్న అంశంపై వివాదం నడుస్తోంది. హిందూ మతానికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని టిడిపి కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. జాతీయ మీడియాలో సైతం దీనిపై కథనాలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తమిళనాడులో జగన్మోహన్ రెడ్డితో అక్కడి నాయకులు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. ప్రధానంగా తమిళనాడు అంటేనే ద్రవిడ సిద్ధాంతం.. ఆపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. సనాతన ధర్మంపై అక్కడ రాజకీయ పార్టీలు ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటాయి. ఆ పార్టీ నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కుటుంబ వేడుకలో
చెన్నైలో( Chennai) జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఒక వివాహ వేడుక జరిగింది. కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీ కే పార్టీ అధినేత విజయ్ దళపతి, సినీ నటులు సూర్య, కార్తీ, మంచు మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు. అయితే విజయ్ తో జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం స్టాలిన్ సైతం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇంకోవైపు విజయ్ ఎక్కువసేపు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనినే సోషల్ మీడియాలో హైలైట్ చేస్తోంది. సాక్షి మీడియాలో సైతం ఈ ఇద్దరు భేటీకి ప్రాధాన్యం లభించింది.
విజయ్ తో సన్నిహిత్యం తమిళనాడులో( Tamil Nadu) విజయ్ పార్టీ ఒంటరిగా పోరాటం చేయడానికి నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నట్లు తమిళనాడులో పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా వెలిసాయి. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో హిందుత్వవాదంతో ముందుకు భారతీయ జనతా పార్టీ. పలని స్వామి అన్న డీఎంకేతో పాటు దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమిళనాడులో తరచూ పర్యటిస్తూ సనాతన ధర్మం పేరిట గట్టిగానే మాట్లాడుతున్నారు. దీనిపై అక్కడి రాజకీయ పార్టీలు పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పార్టీల నేతలతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో చనువుగా ఉంటున్నారు. ఒకవైపు ఏపీలో హిందూ వ్యతిరేక ముద్ర వైసిపి పై పడుతోంది. ఇంకోవైపు తమిళనాడు నేతలతో జగన్మోహన్ రెడ్డి చెట్టపట్టాలు వేసుకోవడం.. కచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.