Janasena MLA woman victim viral video: ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ మీద ఓ యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంచలన విషయాలతో ఆమె నిన్న విలేకరులకు కీలకమైన వివరాలు అందించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలను జనసేన పార్టీకి అనుకూలంగా వ్యవహరించే నెటిజన్లు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.
ఆ వీడియోలో శ్రీధర్ మీద ఆరోపణలు చేసిన యువతి కనిపిస్తోంది. అందులో ఆమె వ్యక్తితో మాట్లాడుతోంది. ” నా దగ్గర సంచలన విషయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్ కు సంబంధించిన వీడియో కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీకు ఇస్తాను. మీరు వాటిని మీ పత్రికలో ప్రచురించండి. మీ ఛానల్ లో ప్రసారం చేయండి” అంటూ ఆ యువతి పేర్కొంది. దానిపై ఆ విలేకరి ఆమెతో చర్చలు జరిపాడు. ” ముందుగా మీరు ఆ వివరాలు మాకు ఇవ్వండి. ఆ వీడియోలు కూడా అందజేయండి. వాటిని చూసిన తర్వాత మేము ప్రచురించాలా? ప్రసారం చేయాలా? అనే విషయాలను ఆలోచించుకుంటామని” చెప్పాడు.
ఈ వీడియో తెరపైకి రావడంతో జనసేన నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు. ” ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర. డీప్ ఫేక్ వీడియోలను రూపొందించారు. ఎమ్మెల్యే శ్రీధర్ మీద లేని పోని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీధర్ మీద ఆరోపణ చేయడానికి ముందు చాలా కుట్రలు జరిగాయి. ఇందులో భాగంగానే ఈ చర్చలు జరిగాయి. ఈ వీడియో బయటకి రావడం తో కుట్రలు బయట పడుతున్నాయని” జనసేన నాయకులు అంటున్నారు.
జనసేన నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ యువతి శ్రీధర్ మీద ఆరోపణలు చేసిందో.. వీడియోలను బయటపెట్టిందో.. అప్పుడే జనసేన నాయకులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ యువతికి సంబంధించిన ఒక్కొక్క ఆధారాన్ని బయట పెట్టడం మొదలుపెట్టారు. ఆ యువతి నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు సంబంధించి కొన్ని విషయాలు గందరగోళంగా ఉండడంతో.. అందులో ఉన్న అసత్యాలను జనసేన నాయకులు బయటపడుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే శ్రీధర్, ఆ యువతి ఎపిసోడ్ ఏపీలో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది.
ఎమ్మెల్యే తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.
కానీ ఈ సాక్షి టీవీ, వైసీపీ కుట్రల మీద కూడా విచారణ చెయ్యాలి.
జనసేనని బాధనాం చేయడానికి ముందుస్తుగా వేసుకున్న ప్లాన్, అడ్డంగా దొరికేసిన వాణి. #RailwayKoduru #AravaSridhar #JanasenaMLA #JanaSenaParty pic.twitter.com/QeELX39hAL
— SBS (@SBSUSA007) January 28, 2026