Largest Glass Bridge In AP: ఏపీ ప్రభుత్వం( AP government) పర్యాటక రంగంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పర్యాటక రంగం అంతంతమాత్రంగానే అభివృద్ధి చెందింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో పర్యాటక నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే విశాఖలో పర్యాటక పరంగా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన అక్కడ ఏర్పాటు కానుంది. 50 మీటర్ల పొడవుతో ఉండే ఈ వంతెన పై తిరుగుతూ పర్యాటకులు.. సాగర తీరం అందాలను వీక్షించవచ్చు. ఇప్పటికే విశాఖ నగరంలో హోమ్ స్టేలు, ఎయిర్ డ్రోమ్స్ వంటివి అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు గాజు వంతెనతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధించనుంది. విశాఖ నగరంలో టూరిస్ట్ స్పాట్లుగా చాలా తీర ప్రాంతాలను గుర్తించింది పర్యాటకశాఖ. వాటిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉంది. దేశంలోనే టూరిస్ట్ స్పాట్ గా విశాఖను నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈ అతి పెద్ద గాజు వంతెన.
Also Read: పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇదొక్కటే మైనస్ అయిందా..?
* 50 మీటర్ల పొడవుతో..
దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన విశాఖపట్నంలో( Visakhapatnam) నిర్మిస్తున్నారు. దాదాపు దీని నిర్మాణం కూడా పూర్తయింది. రెండు నుంచి మూడు వారాల్లో ఈ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే దీని నిర్మాణం చేపట్టారు. కైలాసగిరి వద్ద అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. కైలాసగిరి వద్ద టైటానిక్ న్యూ పాయింట్ కు సమీపంలో 50 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి ఏర్పాటు జరుగుతోంది. ప్రకృతి సౌందర్యం, సముద్రపు అందాలను ఆకాశము నుంచి వీక్షించేలా దీనిని నిర్మిస్తున్నారు. ప్రకృతి ప్రేమికుల తో పాటు సాహస ప్రియులకు ఇది ఎంతగానో ఆకట్టుకోనుంది. దేశంలో ఇతర ప్రాంతాల్లో గాజు వంతెనలు ఉన్నాయి కానీ.. అన్నింటికంటే పెద్దది ఇది.
* విశాఖ కైలాసగిరిలో..
కైలాసగిరిలో( Kailash Giri) ఈ గాజు వంతెన నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించారు. దీనికి గాను ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఈ వంతెన అందుబాటులోకి వస్తే దేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనగా గుర్తింపు పొందడం ఖాయం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ, కొన్ని ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మాణం చేపడుతున్నాయి. ఈ గాజు వంతెన పై ఒకేసారి 40 మంది వరకు నిల్చుని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద గాజు గ్లాస్ వంతెన కేరళలో ఉంది. దీని పొడవు 40 మీటర్లు. విశాఖలో ఈ కొత్త బ్రిడ్జి అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందనుంది.
Previous govt term:
Floating bridge – DisasterPresent govt: Glass Bridge#Vizag pic.twitter.com/pFpR5Jflmu
— – 「KaͥRaͣnͫ」 (@Hidderkaran) September 1, 2025