TDP Leaders: ఐదేళ్లలో వైసీపీ నేతల వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉండేది.చాలామంది నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆడియోలు,వీడియోలు బయటపడ్డాయి.ఆ సమయంలో టిడిపి నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చేవి. అధినేత తీరును బట్టి కింద స్థాయి నేతల పని తీరు ఉంటుందని విమర్శలు చేసేవారు.అప్పట్లో జగన్ క్యాబినెట్ లో ఉన్న నేతల ఆడియోలు,వీడియోలు బయటపడ్డాయి కూడా. అయితే అప్పట్లో విమర్శలు చేసిన టిడిపి నేతలు ఇప్పుడు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం వీడియో ఒకటి బయటపడింది. చాలా వివాదాస్పదం అయింది. తిరిగి ఆయనపై వేటు వేసేదాకా పరిస్థితి వచ్చింది. నేపథ్యంలోనే చంద్రబాబు పలుమార్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు. తప్పిదాలకు పాల్పడ వద్దని.. సోషల్ మీడియా డేగ కన్నుతో చూస్తుందన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు. కానీ తమ్ముళ్లలో అటువంటి పరిస్థితి కానరావడం లేదు.
* ఏకంగా సభలోనే
తాజాగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించే వారని.. ఆ క్రమశిక్షణను గుర్తించి చంద్రబాబు పదవి ఇచ్చారని టిడిపి నేతలు పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటలు దాటితే ఓ పెగ్గు అంటూ ఓ నేత మాట్లాడారు. మిగతావారు సీసాలకు సీసాలు లేపేస్తారని.. టిడిపి నేతలు మాత్రం క్రమశిక్షణతో ఒక్క పెగ్గు మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఆ నేత మాటలతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. అదే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.
* లైన్ దాటుతున్న నేతలు
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా అభివర్ణిస్తారు చంద్రబాబు. ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని చూస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే అలా లేదు. లైంగిక ఆరోపణలతో పాటు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఉందన్న చంద్రబాబు హెచ్చరికలు సైతం పనిచేయడం లేదు. ఇలానే కొనసాగితే ఏదో రోజు కొంప మునగడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి హై కమాండ్ ఈ విషయంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుందా? అన్నది చూడాలి.
మీరేంటో.. మీ విధానాలేంటో.. సభ్య సమాజానికి ఈ మెసేజ్లేంటి చంద్రబాబూ?#APisNotinSafeHands#IdhiMunchePrabhutvam#SadistChandraBabu#MosagaduBabu#AndhraPradesh pic.twitter.com/8Z0IXS2hcv
— YS Jagan Times (@YSJaganTimes) November 27, 2024