YCP: జడ శ్రావణ్ కుమార్..గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పేరు ఇది. వృత్తి రీత్యా న్యాయవాది.. పైగా జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు కూడా. గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారు. అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేవారు. అయితే ఈ ఎన్నికల్లో సీన్ మారింది. కూటమి తరుపున ప్రాతినిధ్యం వహించాలని భావించారు శ్రావణ్ కుమార్. అవకాశం దక్కకపోయేసరికి రాజకీయంగా స్తబ్దతగా ఉండిపోయారు.గతంలో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకించిన మాదిరిగానే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. తన వాయిస్ ను వినిపిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. చైర్మన్ గా టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. 24 మంది సభ్యులను నియమించారు. అయితే టీటీడీ బోర్డుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు శ్రావణ్ కుమార్. ఇది టీటీడీ బోర్డు కాదని.. టిడిపి బోర్డు అని ఆరోపించారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు ట్రస్ట్ బోర్డు సభ్యులా అంటూ ప్రశ్నించారు. చైర్మన్ డిఆర్ నాయుడు పై చాలా ఆరోపణలు ఉన్నాయని.. క్రిమినల్ కేసులు ఉన్నవారు ట్రస్ట్ బోర్డు సభ్యులా అంటూ నిలదీసినంత పని చేశారు. ప్రశాంతి రెడ్డి, జ్యోతుల నెహ్రూ పై ఐటి ఎగవేత కేసులు ఉన్నాయని.. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పై 23 కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు జడ శ్రావణ్ కుమార్. బాబు అరెస్టు సమయంలో క్యారేజీలు మోసిన ముని కోటేశ్వరరావుకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఆయన. అయితే ఒక్కసారిగా శ్రవణ్ కుమార్ నుంచి ఈ విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వణికిపోయింది. అయితే ఆ పని చేయాల్సింది వైసిపి. కానీ ఓ చిన్నపాటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ విమర్శలు ముందు వైసీపీ తేలిపోయింది. వైసిపి ఫెయిల్యూర్ కు అదే కారణంగా తెలుస్తోంది.
* ఆ లోపాన్ని గుర్తించలే
అయితే టీటీడీలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు చోటు ఇవ్వడంపై వైసీపీ నుంచి విమర్శలు రావాలి. కానీ దానిని గుర్తించడంలో వైసిపి విఫలమయింది. అటు అనుకూల సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో సైతం ఇది హైలెట్ కాలేదు. కేవలం జడ శ్రావణ్ కుమార్ బయట పెట్టిన తర్వాత మాత్రమే వైసిపి తో పాటు అనుకూల మీడియా ప్రచారం చేయడం ప్రారంభం అయ్యింది. అయితే ఇప్పుడు అందరివేళ్ళు జగన్ చీఫ్ పీఆర్వో గా విధులు నిర్వహిస్తున్న పూడి శ్రీహరి పై చూపిస్తున్నాయి. గతంలో ఈయన సీఎం ఓ చీఫ్ పిఆర్వో. వైసిపి అధికారం కోల్పోవడంతో పూడి శ్రీహరి ఆ పార్టీలో కీలకమయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతలు మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండగానే ఆయన పనితీరు తెలిసిపోయింది. ఇప్పుడు ఆయననే తీసుకొచ్చి ఏకంగా జగన్ చీఫ్ పీఆర్వో చేశారు.
* పీఆర్వో శ్రీహరి ఫెయిల్యూర్
కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. మరో పది రోజుల్లో ఐదు నెలలు పూర్తికానుంది. చాలా విషయాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వ్యతిరేక టాక్ కూడా ప్రారంభం అయింది. ఈ తరుణంలో వైసిపి చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. కూటమి నిర్ణయాల్లో లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ముఖ్యంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. కనీసం నిబంధనలు పాటించలేదని ఆధారాలతో చూపారు జడ శ్రావణ్ కుమార్. కానీ ఒక బాధ్యతాయుతమైన పీఆర్వోగా ఉన్న పూడి శ్రీహరి దీనిని గుర్తించలేకపోయారు. తాను చేయాల్సిన పనిని పూర్తి చేయలేకపోయారు. టీటీడీ ట్రస్ట్ బోర్డులో నేరచరితుల వివరాలను మీడియాకు చేర్చలేకపోయారు. తాను చేయాల్సిన పని మరెవరో చేస్తూ.. వాటిని వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేసుకోవాల్సి వచ్చినందుకు కచ్చితంగా చీఫ్ పిఆర్ఓ శ్రీహరి సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంది. ఇటువంటి చిన్నపాటి లాజిక్కులు మిస్ అయితే కచ్చితంగా వైసీపీ మూల్యం చెల్లించుకోవడం అనేది కొనసాగుతూ ఉంటుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: That is where the ycp utter flops how did they miss such a small logic
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com