Ambati Rambabu viral dance: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ఇప్పట్లో తెలుగు సినీ పరిశ్రమతో సెట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమ వ్యక్తులు వైసిపి తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ బాహటంగా వచ్చి మద్దతు తెలిపే అవకాశం లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి. అందుకే చిత్ర పరిశ్రమ కూటమి ప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉంటుంది. అయితే తాజాగా మాజీ మంత్రి అంబటి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు పవన్ రాకపోవడానికి గుర్తిస్తూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చారు నటుడు బ్రహ్మాజీ. అయితే బ్రహ్మాజీ స్పందించడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది వరదల సమయంలో సైతం ఇలానే నేరుగా మాజీ ముఖ్యమంత్రి కే సెటైరికల్ సమాధానం ఇచ్చి.. షాక్ ఇచ్చినంత పని చేశారు. ఇప్పుడు మరోసారి అటువంటి అర్థం వచ్చేలా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విమర్శలకు అవకాశం లేకుండా..
విశాఖ( Visakhapatnam) వేదికగా రెండు రోజులపాటు పెట్టుబడుల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయి. అయితే ఈ పెట్టుబడుల సదస్సుపై వైసీపీ పెద్దగా స్పందించలేదు. వైఫల్యాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటువంటి తరుణంలో మాజీమంత్రి అంబటి రాంబాబు ఒక సంచలన ట్వీట్ చేశారు. పెట్టుబడుల సదస్సుకు చినకమ్మ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని సెటైరికల్ గా ప్రశ్నించారు. దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. ఇంతలో నటుడు బ్రహ్మాజీ ఆ పోస్ట్ పై స్పందించారు. సార్ మీ డ్యాన్స్ అంటే ఇష్టం.. మరోసారి చూడాలని ఉంది అంటూ అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. అసలు ఏ ఉద్దేశ్యంతో బ్రహ్మాజీ ఆ పోస్ట్ పెట్టారు అర్థం కావడం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తెగ మండిపడుతున్నాయి.
గతంలో నేరుగా జగన్మోహన్ రెడ్డికి..
అయితే బ్రహ్మాజీ( Brahma ji) ఇలా పోస్టులు పెట్టడం తొలిసారి కాదు. గతంలో కూడా వరదల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెంటనే స్పందించిన బ్రహ్మాజీ.. సీఎం సార్ 1000 కోట్ల రూపాయల కేటాయించి వరద బాధితులను ఆదుకుందాం. రండి వరద ప్రాంతాల్లో పర్యటిద్దాం అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం.. బ్రహ్మాజీ స్పందించడం.. కొత్త వివాదానికి దారి తీసింది.
I like your dancing style sir..
looking forward to watch again..— Brahmaji (@actorbrahmaji) November 15, 2025