Homeఆంధ్రప్రదేశ్‌Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్!

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్!

Thalliki Vandanam Scheme: ఏపీలో( Andhra Pradesh) తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల చదువుల సాయానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు చదువు సాయం కింద ఏడాదికి 15000 రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. గత విద్యా సంవత్సరంలో సైతం పిల్లలకు నగదు అందించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇది నిజంగా శుభ పరిణామం. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

* సీఎం చంద్రబాబు స్పష్టత..
నెల్లూరు( Nellore) జిల్లా వింజమూరులో పర్యటించారు చంద్రబాబు. ఈ సందర్భంగా తల్లికి వందనం పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ లోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని తెలిపారు. ఈనెల 24తో పాఠశాలలతో పాటు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల అనంతరం జూన్లో విద్యాసంస్థలు తెరుచుకొనున్నాయి. ఆ సమయంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున నిధులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

* ఇంట్లో అందరు పిల్లలకు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమ్మ ఒడి పేరిట పథకాన్ని అమలు చేసేవారు. అయితే ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2024 ఎన్నికల కు ముందు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేశారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా పిల్లలందరికీ సాయం అందించాలని నిర్ణయించారు. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆ సమయంలోనే విద్యార్థులకు పుస్తకాలతో కూడిన కిట్లు.. ఆపై తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version