Site icon OkTelugu

Thalliki Vandanam Scheme: అవి ఉంటేనే ‘తల్లికి వందనం’.. తాజా అప్డేట్స్!

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈరోజు నేర్చుకున్నాయి. 50 రోజుల వేసవి సెలవుల విరామం అనంతరం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లారు. మరోవైపు విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కాలేజీల్లో ఈరోజు నుంచి మధ్యాహ్నం భోజనం అమలు కానుంది. అయితే తల్లికి వందనం పథకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఈ వారంలోనే పలికి వందనం నిధులు జమ చేసేలా నిర్ణయించారు. కానీ ఇప్పుడు మార్పు తప్పేలా లేదు. ఇప్పుడు సరికొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. లబ్ధిదారులకు కీలక సూచనలు అందించారు. చాలా రోజుల కింద నుంచి తల్లికి వందనం పథకం సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు. ఈనెల 19 లేదా 20న నిధులు జమ చేస్తారని అంతా భావించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై ఆలోచన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అది సాధ్యమయ్యేలా లేనట్లు తెలుస్తోంది.

* గత ఏడాది అలా..
గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థి మిత్ర కిట్లు అందించారు. కానీ ఈ ఏడాది అవి కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వాటి తయారీపై కూడా పడింది. అందుకే ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తల్లికి వందనం పథకం అమలుపైన అధికారులకు తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి.
* తల్లికి వందనం నిధులు అందుకోవాలని తప్పనిసరిగా తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఎన్పీసీఐ పూర్తయి ఉండాలి. బ్యాంకు కేవైసీ వివరాలు అప్డేట్ పూర్తి చేసుకోవాలి. గ్రామ సచివాలయాలకు వెళ్లి ఏమైనా తప్పిదాలు ఉంటే సరి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలి.

Exit mobile version