Telugu Media: ఇక ఆ పత్రిక దేశంలోనే టాప్ టెన్ జాబితాలో ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా కార్డు టారిఫ్ మీద 75% డిస్కౌంట్ ఇస్తోంది. ఐనా రెవెన్యూ రావడం లేదు. దీంతో ఈనెల 28 కోట్ల జీతాల బిల్లు ఎలా సర్దుబాటు చేయాలో మేనేజ్మెంట్ కు ఏమాత్రం అర్థం కావడం లేదు.
తెలుగులో పాపులర్ అయిన ఛానల్ అది.. దానికి ఓటీటీ కూడా ఉంది.. యాప్, రెండు న్యూస్ చానల్స్ ను ఆ మధ్య తీసుకొచ్చింది. కానీ అవి రెండు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇక చేసేదేమీ లేక నాసిరకమైన యూట్యూబర్ల స్థాయికి ఆ ఛానల్ పడిపోయింది. అత్యంత దారుణంగా రీల్స్, షార్ట్స్ రెవెన్యూ తో సో సో గా నిర్వహిస్తోంది. గత 30 ఏళ్లుగా ఎన్నడూ చూడనటువంటి దారుణమైన రెవెన్యూను ఈసారి చూస్తున్నామని.. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మార్కెటింగ్ హెడ్ అంటున్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ చాలామంది పాత్రికేయులు.. సంపాదకులు.. మేనేజింగ్ ఎడిటర్లు వందల కోట్లు సంపాదించుకున్నారు. విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వాహనాలు.. స్థిరాస్తి వెంచర్లు.. ఇతర పెట్టుబడులు లెక్కేసుకుంటే వందల కోట్లు దాటిపోతాయి. కాకపోతే వాళ్లు పని చేస్తున్న యాజమాన్యాలు మాత్రం అంతకంతకు దిగజారిపోతున్నాయి. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే.. యాజమాన్యాలు వారిని పక్కన పెట్టలేవు.. పైగా భారీగా వేతనాలు ఇస్తాయి. ఇలా ఎలా సాధ్యమో ఆ యాజమాన్యాలకే తెలియాలి.. అందువల్లే ఇటీవల కొంతమంది ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో పనిచేసే సిబ్బంది.. అక్కడ ఎదుగు బొదుగు లేని జీవితాన్ని చూసి పిఆర్వోలుగా జాయిన్ అవుతున్నారు.. ఇంకా కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు. సాధారణంగా డెస్క్ లలో పనిచేసే జర్నలిస్టులకు కాస్తో కూస్తో జ్ఞానం ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడున్న స్టాఫ్ మొత్తం సింగల్ వార్తకు గంట టైం తీసుకుంటున్నారు. ఇక బ్యూరోలు అయితే చెప్పే పరిస్థితి లేదు. అందువల్లే వారంతా కలిసి అడ్డగోలుగా పాత్రికేయాన్ని నడిబజార్ లో అమ్ముకుంటున్నారు. ఇక మీడియా పరిస్థితి ఇలా ఉంటే ఓటీటీ కూడా అనుకున్నంత గొప్పగా లేదు. రెండు పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ఏర్పాటు చేసిన ఓటీటీ నేల చూపులు చూస్తోంది. దానిని విక్రయించాలని ఆ సంస్థలు అనుకుంటున్నట్టు వినికిడి. అయినప్పటికీ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట.. ఇక డిజిటల్ జర్నలిజం కూడా అలానే ఉంది. ప్రతినెలా 30 లక్షలు ఖర్చుపెట్టి..”ఈ పేపర్ ” ను తీసుకొస్తున్న ఒక సంస్థ దారుణమైన నష్టాల్లో ఉందట. ఇంత చెప్పారు కదా.. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుందని.. ఎన్ని రోజులు ఇలా భరించాలని.. అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నం కావచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్లతో కూడుకున్న వ్యవస్థలు. కాబట్టి నడుస్తూనే ఉంటాయి.. ఎవరో పెట్టుబడి పెడుతుంటారు.. ఇంకెవరో నడిపిస్తుంటారు.. అంతిమంగా చూస్తే న్యూట్రల్ జర్నలిజం అనేది తెలుగులో ఉండదు. ఉండే అవకాశం కూడా లేదు.