AP Elections 2024: వైసీపీకి ప్రత్యర్థిగా తెలుగు చిత్ర పరిశ్రమ

AP Elections 2024: వైసిపి పై తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగుబాటు ప్రారంభమైందా? ఎన్నికల్లో ప్రభావం చూపుతోందా? ఒక్కొక్కరు పవన్ కు మద్దతు తెలపడానికి అదే కారణమా? ఈ రెండు రోజుల్లో మరింత మంది ముందుకు వస్తారా? బాహటంగా మద్దతు ప్రకటిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని చిరంజీవి ప్రత్యేక వీడియో ప్రకటించిన తర్వాత.. యువ హీరోలంతా పవన్ కు మద్దతు ప్రకటించారు. నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ , సంపూర్ణేష్ బాబు ఇలా ఒక్కొక్కరు ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఏకంగా వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. వైసీపీ శ్రేణులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు.

అయితే చిత్ర పరిశ్రమ విషయంలో వైసీపీ సర్కార్ ఎన్ని రకాలు ఇబ్బందులు పెట్టాలో అంతలా పెట్టింది. ముఖ్యంగా టిక్కెట్ల ధర పెంపు విషయంలో అడ్డగోలుగా వ్యవహరించింది. వైసీపీ మంత్రులు అయితే స్థాయికి మించి స్పందించారు. మెగాస్టార్ లాంటి వ్యక్తులను సైతం అవమానపరిచారు. కొందరు సినీ పరిశ్రమ వ్యక్తులతో కలిసి చిరంజీవి జగన్ ను ఆశ్రయించారు. ఆ సమయంలో దొడ్డి దారిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి జగన్ ను బతిమిలాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సగటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆ వీడియోను చూసి చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచే వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావన అలవర్చుకున్నారు.

గత ఎన్నికల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి మద్దతు ప్రకటించారు. టిడిపి సానుభూతిపరులైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం సైలెంట్ అయ్యారు. దానికి కారణం తెలంగాణలో కెసిఆర్ సర్కార్ అప్పట్లో అధికారంలో ఉండడమే. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మిగిలిన కేసీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి అండగా నిలిచారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రేవంత్ అధికారంలో ఉండడంతో.. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఏపీలో తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే నలుగురు కుర్ర హీరోలు పవన్ కళ్యాణ్ కు బాహటంగానే మద్దతు ప్రకటించగలిగారు.

తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మనసులో ఉన్న బాధను, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడు. ఆయనతో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. అటు వ్యక్తిగతంగా కూడా పవన్ అంటే త్రివిక్రమ్ అభిమానిస్తారు. ఒకానొక దశలో ఆరాధిస్తానని చెప్పుకొచ్చారు. అటు పవన్ కళ్యాణ్ సైతం చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అత్యంత ఆప్తుడని చెప్పుకొచ్చారు. అయితే పవన్ పై అభిమానంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన కోసం ఒక పాట రాశారు. అప్పటి నుంచి వైసీపీ టార్గెట్ చేసుకుంది. సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో.. ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5000 కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఫోన్ చేస్తున్నవారు తిట్ల దండకాన్ని, శాపనార్ధాలు పెట్టినట్లు త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వైసీపీని ఓడించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మొత్తానికైతే తెలుగు చిత్ర పరిశ్రమను వైసిపి చేజేతులా ప్రత్యర్థిగా మార్చుకుంటుంది. పోలింగ్ కు ముందు సినీ పరిశ్రమ పెద్దలు మరింత మంది ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది.

Get notified whenever we post something new!

Continue reading

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. అటువంటి నేత అరెస్టు భయంతో ఇప్పుడు కుటుంబ సభ్యులతో సహా...

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version