TDP Media : రాష్ట్రమంతా ఇప్పుడు అసలు చంద్రబాబు అవినీతి అన్నది ఇష్యూనే కాదు. టీడీపీ మీడియాకు అసలు అది వార్తనే కాదు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కూడా అది పట్టించుకోడు.. చంద్రబాబు అంటే అంతులేని ప్రేమ.. పగోడు జగన్ అంతులేని ద్వేషం ప్రదర్శిస్తూ టీడీపీ మీడియా ఎంత దిగజారాలో అంతే దిగజారుతోంది. చంద్రబాబు కోసం ఏమైనా కోసుకోవడానికి టీడీపీ మీడియా సిద్ధమైపోతోంది. చంద్రబాబు జైలుకెళ్లడానికి రెడీ అయినా కూడా దాన్ని వార్తగా చూడని టీడీపీ మీడియా తీరుపై అందరూ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రజలు ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నారు. టీడీపీ మీడియాను, పచ్చపత్రికలను నమ్మే రోజులు పోయాయి. పాలు ఏవో నీళ్లు ఏవో తేలిపోయింది. అందుకే టీడీపీ మీడియా, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కూడా వాటిని పసిగడుతున్నారు. చంద్రబాబుపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించినా.. రేపు అరెస్ట్ చేసి జైలుకు పంపించినా కూడా టీడీపీ మీడియాకు వార్తకానంతగా అది కాపు కాస్తోంది. మీడియా విశ్వసనీయతనే దెబ్బతీస్తోంది..
నిన్న సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. ఒక స్పష్టమైన డైరెక్షన్ ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో గత చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపైన.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడం కోసం ఏర్పాటు చేసిన ‘సిట్’ తన పనిచేయకుండా ఓ మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది. ఆ మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేస్తూ దీనిపై తీర్పు చెప్పండి అంటూ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది జగన్ ప్రభుత్వానికి గొప్ప ఊరటకలిగించే వార్త.. ఇక ప్రతిపక్ష టీడీపీకి, చంద్రబాబుకు షాక్ లాంటి తీర్పు.
తెలుగు నాట చంద్రబాబు స్థాపించిన టీడీపీ అనుకూల మీడియా బలంగా ఉంది. విచ్చలవిడిగా అది బట్టలిప్పి రెచ్చిపోతూనే ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి బలమైన టీడీపీ మీడియా ధాటికి వైసీపీ, జగన్ కూడా నిలవలేకపోతున్నారు. అంత బలంగా విషప్రచారాన్ని చేస్తూ ఏపీప్రజలను తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు ఈ టీడీపీ మీడియా..
జగన్ మోహన్ రెడ్డికి , ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఎవరు పిటీషన్ వేసినా కోర్టు దాన్ని స్వీకరిస్తే కూడా జగన్ మోహన్ రెడ్డికి అది షాక్ అంటూ టీడీపీ మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుంటుంది. జగన్ కు చమటలు, ఆందోళన, షాక్ అంటూ ఆ టీడీపీ మీడియాల్లో కొన్ని వందల చర్చలు, వందల వీడియోలు వేసుకుంటారు.
కానీ చంద్రబాబు ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపించవచ్చు అంటూ నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పునిస్తే తెలుగునాట ఏ టీడీపీ టాప్ మీడియాలో కూడా అస్సలు వార్తగా కూడా చూడలేదు. రాయలేదు. ఇంతకంటే దారుణమైన పరిణామం ఇంకోటి ఉంటుందా? గమనించాల్సిన అవసరం ఉంది.