TDP: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్( greater Visakha Municipal Corporation ) పీఠాన్ని కైవసం చేసుకోనుంది తెలుగుదేశం పార్టీ. నాలుగు దశాబ్దాల తర్వాత మేయర్ పదవి ఆ పార్టీ చేజిక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో అక్కడ బలం ఉంది. కానీ పరిస్థితులు కలిసి రాక.. గ్రేటర్ పీఠం అందని ద్రాక్షగా ఉండేది. అటువంటిది ఈసారి అనూహ్యంగా దక్కించుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కొత్త మేయర్ ఎంపిక అనివార్యంగా మారింది. ప్రధానంగా పీలా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తే నాలుగు దశాబ్దాల తరువాత.. గ్రేటర్ పీఠం టిడిపికి దక్కినట్టు అవుతుంది.
Also Read: పదవుల కోసం జగన్ కు సాష్టాంగ నమస్కారాలు.. నిజం ఎంత?
* 1981లో తొలి ఎన్నిక..
బ్రిటిష్ పాలనలో విశాఖపట్నం( Visakhapatnam) మున్సిపాలిటీగా. 1979లో కార్పోరేషన్ గా అవతరించింది. కానీ కార్పొరేషన్ కు తొలి ఎన్నిక మాత్రం 1981 లో జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలేదు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ నేత ఎన్ఎస్ఎన్ రెడ్డి తొలిసారిగా మేయర్ అయ్యారు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అక్కడికి నాలుగేళ్ల తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపితో పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది టిడిపి. డివి సుబ్బారావు మేయర్ అయ్యారు. అటు తరువాత ఇంతవరకు గ్రేటర్ పీఠాన్ని టిడిపి గెలుచుకోలేకపోయింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టిడిపి అధికారంలోకి లేకపోవడం కూడా మైనస్ గా మారింది.
* 2021లో వైసిపి విజయం..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. కానీ వివిధ కారణాలతో విశాఖ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. 2019లో నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ 2021 మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ గెలవలేకపోయింది. 2014కు ముందు మూడుసార్లు మున్సిపల్ ఎన్నికలు జరగగా.. గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 1995, 2000 ఏడాదిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. టిడిపి అధికారంలో ఉన్నా.. గెలవలేకపోవడం మైనస్ గా మారింది. అయితే నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత గ్రేటర్ పీఠం టిడిపికి దక్కడం నిజంగా విశేషం.
* నగరంలో బలంగా ఉన్నా..
విశాఖ నగరంలో( Visakha City ) తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం రాష్ట్రమంతటా కనిపించింది. కానీ విశాఖ నగరం విషయానికి వచ్చేసరికి నాలుగు నియోజకవర్గాలను టిడిపి గెలిచింది. అయితే నగరంలో పట్టున్న తెలుగుదేశం పార్టీ గ్రేటర్ విషయానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా చతికల పడింది. మేయర్ పీఠం టిడిపి దక్కించుకునే అవకాశం ఉంది. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read: అయ్యా రాధాకృష్ణ గారు.. ఇలాంటి స్టోరీలతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?