https://oktelugu.com/

Breaking : బ్రేకింగ్ : టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు.  తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు వెంట‌నే విజ‌య‌వాడ‌లోని ర‌మేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 7, 2023 / 03:04 PM IST
    Follow us on

    Breaking : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు.  తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు వెంట‌నే విజ‌య‌వాడ‌లోని ర‌మేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ స‌భ్యులు, టీడీపీ శ్రేణులు కాస్త ఊపిరిపీల్చుకున్నాయి.ప్రస్తుతం రాజేంద్రప్రసాద్  స‌ర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. టీడీపీలో చురుగ్గా ఉండే నేతల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. పార్టీ విధానాలపై స్పష్టంగా మాట్లాడగలరు. ఆయన సీనియార్టీని గుర్తించిన టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.

    టీడీపీ వాయిస్ వినిపించడంలో రాజేంద్ర ప్రసాద్ ముందుంటారు. టీవీ డిబేట్లలో సైతం ఎక్కువగా కనిపిస్తుంటారు.ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం పూర్తి కావడంతో రాజ‌కీయాల‌కు కాస్తా దూరంగా ఉన్నారు. కానీ సర్పంచ్ ల సంఘంలో మాత్రం యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గుండెపోటుకు గురి కావ‌డం టీడీపీ శ్రేణుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వైద్యులు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. యాంజియోగ్రామ్ చేసిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని వైద్యులు తెలిపారు. బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.

    బాబు రాజేంద్రప్రసాద్ 1978లో ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఓ యూత్ సర్వీస్ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1995లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఉయ్యూరు నుంచి పోటీచేసి సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా.. 1996లో ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో ఉయ్యూరు జెడ్పీటీసీగా గెలిచారు. 2022లో ఛాంబర్ ఆఫ్ ఏపీ స్టేట్ పంచాయతీరాజ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2006లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.