TDP C-voter survey : సీఓటర్ – ఇండియా టూడే సర్వే ప్రకారం కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని స్పష్టమైంది.ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించనున్నారు. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 320కు పడిపోతుందని తేల్చి చెప్పింది.
బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గినా సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తెలిపింది. ప్రధాన మోదీకి జాతీయ స్థాయిలో ఆదరణ తగ్గకపోయినా.. రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాలకు సీఎంలకు కూడా ఈసారి భంగపాటు తప్పేలా లేదని తెలుస్తోంది.
ఇక ఏపీకి సంబంధించి సీఓటర్-ఇండియా టుడే ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఓటర్ ఇన్ చార్జి ఏదో గాలివాటుగా ఓ మాట అన్నాడు. ఆయన నంబర్స్ ఏమీ చెప్పలేదు. దీన్ని పట్టుకొని టీడీపీ మీడియా చేయని రాద్ధాంతం లేదు. టిడిపి ప్రచారం చేసుకున్నట్లు 15 లోక్ సభ స్థానాల విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే… సర్వే ఫలితాలు వెల్లడిలో చర్చ నడిచింది. ఎన్డీఏ బలం ప్రస్తావనకు వచ్చినప్పుడు సి ఓ టర్ చీఫ్ యశ్వంత్ దేశ్ముఖ్ అన్యాపదేశంగా టిడిపి ప్రస్తావన తీసుకువచ్చారు. బీజేపీతో పొత్తులో ఉంటే టీడీపీకి ఎంపీ సీట్లు పెరగవచ్చన్న అంచనా మాత్రమే చేశారు. అప్పుడే రాజ్దీప్ సర్దేశాయి టాపిక్ ను డైవర్ట్ చేశారు.
కానీ ఎక్కడా అధికారికంగా ఏపీలో తెలుగుదేశం పార్టీకి 15 లోక్ సభ స్థానాలు వస్తాయని చెప్పలేదు. కానీ అసలు ఫలితాలు వెల్లడి కాకముందే ఎల్లో మీడియా దానినే పట్టుకుంది. టిడిపికి అనుకూలంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.
తాజాగా టీవీ9 చర్చలో అసలు నిజాన్ని జర్నలిస్ట్ రజినీకాంత్ బయటపెట్టాడు. తాను సీఓటర్ సర్వే సంస్థ హెడ్ దేశ్ ముఖ్ తో మాట్లాడానని.. టీడీపీకి 15 సీట్లు అన్న వార్త ఫేక్ అని స్పష్టం చేశాడు. అదంతా ఒట్టి ప్రచారం మాత్రమేనని అన్నాడు. దీంతో చర్చలో పాల్గొన్న టీడీపీ నేతలకు అసలు నిజం తెలిసి అవాక్కయ్యారు.
https://twitter.com/SumaTiyyaguraa/status/1696422544872743277?s=20