Chandrababu masterplan: విశాఖను( Visakhapatnam) పాలనా రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖ నుంచి పాలించాలని భావించారు. విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు. నగరాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్ళలేకపోయారు. ఇటువంటి క్రమంలో విశాఖ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పారు. తెలుగుదేశం కూటమిపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే కూటమి 16 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కంటే.. విశాఖ అభివృద్ధి ఎక్కువగా జరిగింది. ఇది కాదనలేని సత్యం కూడా. అన్ని రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఎదురుగా కనిపిస్తున్నాయి కూడా.
ప్రపంచస్థాయి నగరంగా..
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఎప్పటికప్పుడు విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా టార్గెట్ 2028@ విశాఖ అంశాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. 2028 నాటికి విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది ఆయన ప్రణాళిక. కేవలం పెట్టుబడులతోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా పర్యాటకం, పారిశ్రామికంగా కూడా నగరాన్ని తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు చంద్రబాబు.
2028 కి బెస్ట్ సిటీగా..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రకటనలకే పరిమితం అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం చేసి చూపిస్తున్నారు. 2028 నాటికి బెస్ట్ సిటీగా విశాఖను మార్చనున్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటి, పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2028 నాటికి ఐటీలో లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది చంద్రబాబు ప్రణాళికగా కనిపిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఐటి సంస్థలు కొడుతున్నాయి విశాఖకు. తాజాగా రైడెన్ సంస్థకు అనుమతులు ఇచ్చారు. 87 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. తద్వారా పదివేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
అన్ని రంగాల్లో.. పర్యాటకంగా( tourism) విశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేశారు. కైలాసగిరిలో భారీ గ్లాస్ బ్రిడ్జిలు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సరికొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మిట్టల్ కంపెనీ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఇలా అన్ని విషయాల్లో విశాఖ అగ్రగామిగా మారింది. జగన్మోహన్ రెడ్డి రాజధానిని చేసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు అభివృద్ధి చేసి ఆర్థిక రాజధానిగా మార్చుతామని చెబుతున్నారు. అందుకు తగ్గట్టు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా.