Site icon OkTelugu

AP Weather Forecast: ఈ జిల్లాల వారు తస్మాత్ జాగ్రత్త.. ఈరోజు అడుగు బయట పెట్టకపోవడమే మంచిది..

AP Weather Forecast

AP Weather Forecast

AP Weather Forecast: ఎండలు దంచి కొడుతున్నాయి. అదే సమయంలో వాతావరణంలో మార్పులు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అకాలమైన వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో గాలి దుమారం ఏర్పడింది. వర్షాలు కూడా కురిశాయ్. ఆ వర్షాలు అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి.

ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో.. ఎండలకు తగ్గట్టుగానే వర్షాలు కూడా పుడితే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం, సోమవారం ఎండల తీవ్రత కొనసాగుతూనే.. ఆ తర్వాత నాలుగు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వచ్చే ఐదు రోజుల్లో ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో అకాలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా, రాజస్థాన్, విదర్భ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ద్రోని విస్తరించి ఉంది. దీనివల్ల ఆదివారం ఏపీలోనే అనకాపల్లి, తూర్పుగోదావరి, చిత్తూరు, పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలలో వర్షాలకు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో అనూహ్యమైన మార్కుల వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తమ పంట ఉత్పత్తులను వర్షాలకు తడవకుండా కాపాడుకోవాలని చెబుతున్నారు.. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పశువుల కాపరులు.. చెట్ల కిందకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version